ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డీఎంకే, అన్నాడీఎంకే కలిస్తే... టీవీకే సంచలన నిర్ణయం!

  • డీఎంకే, అన్నాడీఎంకే కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 12 మంది ఎమ్మెల్యేలు అవసరం
  • రెండు పార్టీలు కలిస్తే మూకుమ్మడిగా రాజీనామా చేయాలని టీవీకే నిర్ణయం
  • 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠకు ఇంకా తెరపడటం లేదు. ఫలితాలు వచ్చి మూడు రోజులైనప్పటికీ, విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా, లేదా అనేది తెలియడం లేదు. ఓ వైపు టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చిన్న చిన్న పార్టీలను సంప్రదిస్తోంది. ఒక దశలో ద్రవిడ పార్టీలుగా పేరొందిన డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రహస్య చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగింది.

డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కలిసినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 12 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతుంది. దీంతో అది ఎంత వరకు ఫలిస్తుందో తెలియదు. కానీ డీఎంకే, అన్నాడీఎంకే కూటమి కలిసే పరిస్థితి ఉంటే టీవీకే ఏం చేస్తుందనే చర్చ సాగుతోంది. ఆ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే టీవీకే పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలు ( విజయ్ రెండు చోట్ల గెలిచారు. దీంతో ఆ పార్టీ బలం 108గా ఉంది) మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ హెచ్చరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

Vijay Thalapathy
Tamil Nadu politics
DMK
AIADMK
TVK party
Tamilaga Vettri Kazhagam
Tamil Nadu government formation

More Telugu News